కల్యాణ్ రామ్ సినిమాకి ప్రీ టీజర్ డేట్ లాక్ చేసిన మేకర్స్! నందమూరి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే “అర్జున్ సన్నాఫ్ వైజయంతి”. సీనియర్ నటి విజయశాంతి కూడా సాలిడ్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్ గానే వచ్చిన టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంది. అయితే ఇపుడు ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు.
కళ్యాణ్ రామ్ పై మరో పవర్ఫుల్ పోస్టర్ వదిలి ఈ సినిమా తాలూకా ప్రీటీజర్ ని ఈ మార్చ్ 14న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ని అనౌన్స్ చేసేసారు. మరి ఈ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ మంచి స్వాగ్ తో వాక్ చేస్తుండగా టీజర్ పై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్, అశోక సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే సినిమా రిలీజ్ ఎప్పుడు అనేది ఈ టీజర్ తోనే రివీల్ కావచ్చు.