పవన్ తాజా సినిమా పై మేకర్స్ క్లారిటీ! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో తన అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు జ్యోతికృష్ణ తెరకెక్కిస్తుండగా మంచి అంచనాలు ఈ సినిమాపై కూడా ఉన్నాయి. ఇక ఈ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన పాటలు మంచి హిట్ అయ్యాయి.
అలానే మేకర్స్ ఒకో అప్డేట్ ని కూడా ఎప్పటికపుడు అందిస్తుండగా ఇపుడు లేటెస్ట్ గా మరో సాలిడ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఈ చిత్రం డబ్బింగ్ పనులు ఇపుడు స్టార్ట్ చేసేసినట్టుగా మేకర్స్ తెలిపారు. ఫుల్ స్వింగ్ లో ఈ పనులు జరుగుతున్నాయట. ఇక పవన్ కేవలం ఇంకొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉండగా ఇవి ఇస్తే సినిమా పూర్తయ్యిపోతుందని చెప్పవచ్చు. గత ఎన్నికల సమయంలో మొదలు పెట్టిన సినిమా ఇది మరో ఎన్నికలు కూడా అయ్యాయి కానీ ఇంకా రిలీజ్ కాలేదు. మే 9న రిలీజ్ అని ఫిక్స్ చేశారు. మరి అక్కడైనా వస్తుందో లేదో చూడాలి.