విడుదలకు ముందే భారీ వసూళ్లు రాబడుతున్న మహేష్‌ మూవీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో గుర్తుంచుకునే సినిమాల లో “అతడు” కూడా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఎంతగానో అభిమానులను మెప్పించింది. ఇప్పుడు ఆ మ్యాజిక్ మళ్లీ థియేటర్లలో చూడబోతున్న అభిమానులకు ఇది మంచి ట్రీట్‌గా మారుతోంది.

ఈ సినిమా రీ రిలీజ్‌పై అప్పుడే భారీ  హైప్ క్రియేట్ అయ్యింది. మహేష్ బాబు సినిమాలకు సాధారణంగా మొదటి రోజే భారీ స్పందన ఉంటుందన్న విషయం తెలిసిందే. అలాగే ఇసారి కూడా అతడు సినిమా యూఎస్ మార్కెట్‌లో అద్భుతమైన ప్రీ రిలీజ్ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికీ 50 వేల డాలర్ల మార్క్‌ను దాటేసి మంచి వసూళ్లు రాబడుతోంది.

ఇంకా పూర్తిగా థియేటర్లకు వచ్చాక ఈ సినిమా ఎంతవరకు ఆడుతుంది, మహేష్ గత రీ రిలీజ్ కలెక్షన్స్‌ను తిరిగరాస్తుందా అనే ఆసక్తికరమైన విషయాల గురించి సినీ ప్రేమికుల ప్రతిఫలం ఉంది. మొత్తంమీద “అతడు” మళ్లీ ప్రేక్షకుల ముందుకు రావడం అభిమానులకు పండగే అన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories