ముఫాసా కోసం రంగంలోకి దిగిన మహేష్ బాబు!

అడవి  అంతిమ రాజు ముఫాసా: ది లయన్ కింగ్  వారసత్వాన్ని లోతుగా పరిశోధించడానికి సమయం ఆసన్నమైంది, 2019లో వచ్చిన ది లయన్ కింగ్ ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. తాజాగా ఆ సినిమాకి సిక్వెల్ ముఫాసా: ది లయన్ కింగ్ 20 డిసెంబర్ 2024న విడుదలకు రెడీగా ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ముఫాసాకు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు.

మహేశ్ తో పాటు టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పుంబాగా తిరిగి వస్తున్నారు. అలీ టిమోన్‌గా తిరిగి వస్తున్నాడు. ఆగస్టు 26న ఉదయం 11.07 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ అసోసియేషన్ గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. డిస్నీ బ్లాక్‌బస్టర్ లెగసీ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్,  టైమ్‌లెస్ స్టోరీ చెప్పే విధానాన్ని నేను ఎప్పుడూ మెచ్చుకుంటాను, ముఫాసా పాత్రకు వాయిస్ ఇవ్వడం సంతోషంగా ఉంది, ఇది నా పిల్లలతో నేను ఎంతో ఎంజాయ్ చేసే ఫీలింగ్.

డిసెంబర్ 20న తెలుగులో సిల్వర్ స్క్రీన్‌పై ముఫాసా: ది లయన్‌ కింగ్‌ను నా కుటుంబంతో పాటు నా అభిమానులు ఎప్పుడు చూస్తారోనని ఎదురు చూస్తున్నాను” అని తెలిపారు. తమకు నచ్చిన భాషలో సినిమా అనుభవాన్ని ఆస్వాదించడం మా లక్ష్యం. ముఫాసా ఐకానిక్ క్యారెక్టర్ తరాలకు స్ఫూర్తినిచ్చింది.  

ముఫాసా: ది లయన్ కింగ్ తెలుగు వెర్షన్‌లో మహేష్ బాబు గారు ముఫాసా వాయిస్‌కి జీవం పోయడం మాకు చాలా ఆనందంగా ఉంది అని డిస్నీ స్టార్ స్టూడియోస్ హెడ్ బిక్రమ్ దుగ్గల్ పేర్కొన్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories