14 ఏళ్ల క్రితమే ట్వీట్‌!

ఇపుడు ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది కచ్చితంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో వస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ అనే చెప్పుకొవచ్చు. మహేష్ కెరీర్ లో 29వ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ మూవీ కోసం యావత్తు ప్రపంచ తెలుగు ఆడియెన్స్ ఎదురు చూస్తుంటారు. అయితే అసలు ఈ కాంబో లో సినిమా ఎప్పటి నుంచో ఒక అందని ద్రాక్ష గానే మిగిలింది.

ఎన్నో ఏళ్ళు నుంచి అనుకుంటున్న ఈ మూవీ ఎట్టకేలకి ముహుర్త కార్యక్రమాలతో మొదలైంది. ఇక నిన్ననే సినిమా సైలెంట్ గా ముహూర్త కార్యక్రమాలు కూడా జరుపుకోగా ఈ సందర్భంలో మహేష్ బాబు రాజమౌళితో సినిమా కోసం చేసిన ఓ పాత ట్వీట్ ప్రెజెంట్‌ వైరల్ గా మారింది.  2010  మే 22న మహేష్ బాబు రాజమౌళితో సినిమా కోసం చాలా ఎగ్జైట్ అవుతూ అందరికీ ఓ అప్డేట్ ని అందించిన సంగతి తెలిసిందే.

నిజంగా ఓ గుడ్ న్యూస్ నేను రాజమౌళి సినిమా చేయబోతున్నాం మొత్తానికి ఇద్దరం కలిసి ఫైనల్ గా వర్క్ చేస్తున్నాం అంటూ చేసిన పోస్ట్ ని అభిమానులు వెతికి మరీ ఇపుడు హైలైట్ చేస్తూ ప్రస్తుత సందర్భానికి లింక్ చేసి ఆనంద పడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories