యూఎస్‌ మార్కెట్‌ లో దూసుకుపోతున్న మహావతార్‌..!

యానిమేషన్ సినిమాగా వచ్చి ఊహించని స్థాయిలో హిట్ అయిన చిత్రం మహావతార్ నరసింహ. ఈ సినిమాకి డబ్బింగ్ లో కూడా ఎలాంటి స్టార్ వాయిసెస్ లేకపోయినా, ప్రేక్షకులు థియేటర్లకు రావడమే కాకుండా భారీగా వసూళ్లు కూడా వచ్చాయి. ఇండియా లోనే కాదు, విదేశాల్లో కూడా ఈ సినిమా మంచి హడావుడి చేస్తోంది.

కొంచెం ఆలస్యంగా అమెరికా లో విడుదలైనప్పటికీ అక్కడ కూడా సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తోంది. తాజాగా ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ లో 1.8 మిలియన్ డాలర్లను దాటేసింది. ఇప్పుడు 2 మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ఆ లెవెల్ చేరితే ఇండియన్ సినిమా నుంచి యానిమేషన్ కేటగిరీ లో ఆ రికార్డ్ సాధించిన మొదటి మూవీగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories