కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ నటించిన తాజా సినిమా మదరాసి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ఆయన సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా, సినిమాకు పేరు పొందిన దర్శకుడు ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా, తమిళ్ లో ప్రేక్షకులను ఆకట్టుకొని డీసెంట్ కలెక్షన్స్ సాధించింది.
ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకొని, నేటి నుంచి పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసింది. థియేటర్స్ లో మిస్ అయిన వారు ఇక ఇప్పుడు ఓటీటీలో సులభంగా చూసే అవకాశం దొరకనుంది.