యంగ్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో మాత్రమే కాకుండా..కన్నడ లో కూడా పలు చిత్రాల్లో నటించి తన కంటూ పేరును తెచ్చుకుంది. ముఖ్యంగా రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నభా నటేష్‌కు క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటు బిజీగా ఉన్న క్రమంలో ఈ అమ్మడుకి ప్రమాదం జరిగింది. దీంతో కొద్ది కాలం నటనకు దూరమైంది. ప్రస్తుతం హీరో నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా స్వయంభు లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. నభా నటేష్ తాజాగా, తన సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌ను డార్లింగ్ అంటూ ఓ వీడియోను పెట్టింది.
దానిని చూసిన నటుడు ప్రియదర్శి వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ అని రాసుకొచ్చాడు. దానికి నభా రిప్లై ఇస్తూ మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త ”డార్లింగ్” అంటే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ప్రియదర్శి.. ‘‘ మీరేమో డార్లింగ్ అని అనొచ్చు. మేము అంటే మాత్రం ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అని కామెంట్ పెట్టాడు.
ఇక అది చూసిన నభా లైన్ క్రాస్ అవ్వొద్దు అంటూ సీరియస్ అవగా.. ప్రియదర్శి దానికి సమాధానంగా వై దిస్ కొలవెరి అని ఫన్నీ కామెంట్ పెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరి చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది.