సూపర్‌ రెస్పాన్స్ తో మచ్చా మచ్చా సాంగ్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం “గేమ్ ఛేంజర్”. కోలీవుడ్‌ స్టార్‌ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం మెగా అభిమానుల్లో మోస్ట్‌ అవైటెడ్ సినిమాగా నిలిచి ఇప్పుడు విడుదలకి దగ్గరకి వస్తుంది. మరి ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక్కో అప్డేట్ ని విడుదల చేస్తూ వస్తుండగా తాజాగానే సినిమా రెండో సాంగ్ గా పక్కా మాస్ సాంగ్ రా మచ్చా మచ్చా ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు.

మరి ఈ సాంగ్ అయితే ఇప్పుడు భారీ రెస్పాన్స్ తో ముందుకు దూసుకెళ్తుంది. విడుదల చేసిన ఈ కొన్ని రోజుల్లోనే అన్ని భాషల్లో కలిపి 50 మిలియన్ కి పైగా వ్యూస్ ని ఈ సాంగ్ క్రాస్ చేసేసి మ్యూజిక్ లవర్స్ లో చార్ట్ బస్టర్ గా మారింది. ఇక బిగ్ స్క్రీన్స్ పై అయితే ఈ పాట ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా చేస్తున్నారు. అలాగే దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రం ఈ క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories