“మా నాన్న సూపర్ హీరో” టీజర్ లాంఛ్ ఈవెంట్ పూర్తి వివరాలు ఇవే!

టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు చివరిసారిగా హరోం హర సినిమాలో కనిపించి మెప్పించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఆ తరువాత లూజర్ ఫేమ్ డైరెక్టర్ అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మా నాన్న సూపర్ హీరోలో సుధీర్‌ బాబు నటిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది.

అయితే టీజర్ రిలీజ్ డేట్ ను కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ కి సంబంధించిన డీటైల్స్ ను మేకర్స్ నేడు సరికొత్త పోస్టర్ ద్వారా ప్రకటించారు. గురువారం సాయంత్రం 4:00 గంటలకు ఆర్కే సినీప్లెక్స్ స్క్రీన్ 2 లో ఈ ఈవెంట్ జరగనున్నట్లు టాక్‌. ఈ చిత్రంలో ఆర్నా హీరోయిన్ గా నటిస్తుండగా, సాయి చంద్, షాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని ముఖ్య  నటించారు. క్యామ్ ఎంటర్టైన్మెంట్‌తో కలిసి వి సెల్యులాయిడ్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories