పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తాజాగా చేస్తున్న సినిమాల్లో డైరెక్టర్ జ్యోతి కృష్ణతో నిధి అగర్వాల్ హీరోయిన్ గా చేస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “హరిహర వీరమల్లు” . పవన్ నుంచి మొదటి భారీ పాన్ ఇండియా సినిమా ఇది కావడంతో హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరింది. అయితే ఈ సినిమా సహా మరో సినిమా పవన్ ఇపుడు చేస్తుండగా ఇన్నేళ్లులో తన లుక్స్ పరంగా కూడా పలు మార్పులు వచ్చేసాయి.
రీసెంట్ గా అయితే కుంభమేళా నుంచి బయటకు వచ్చిన ఫోటోలులో పవన్ లావయ్యినట్టు క్లియర్ గానే కనిపిస్తుంది. అయితే తాజాగా మాత్రం పవన్ కొంచెం స్లిమ్ లుక్ లో కనిపించి అందర్ని ఆశ్చర్యానికి గురి చేశారు. నిన్న తన పార్టీ మీటింగ్ లో పవన్ జా లైన్ కానీ బాడీ ఫిట్నెస్ కానీ ఇంతకు ముందులా లేదు. దీనితో పవన్ కొన్ని కిలోలు బరువు తగ్గినట్టు తెలుస్తోంది. అది కూడా ఈ కొన్ని రోజుల్లోనే కావడం విశేషం. ఇలా తన లేటెస్ట్ లుక్స్ వైరల్ గా మారాయి.