కాకాణిపై లుకౌట్ నోటీసులు.. బాగా ఆలస్యం అయినట్టే!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్దన రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. వందల వేల కోట్ల రూపాయల విలువైన క్వార్ట్జ్ గనులను అక్రమంగా మైనింగ్ చేయడం మాత్రమే కాకుండా, వాటిని అక్రమంగా విదేశాలకు తరలించిన కేసుల్లో ఆయన కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచారణ నిమిత్తం పిలవడానికి పలుమార్లు ఆయనకు నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. తాజాగా ఆయన కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేశారు. ఆయన దేశం విడిచి వెళ్లకుండా దేశంలోని అన్ని ఎయిర్ పోర్టులు, సీపోర్టులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అయితే.. మాజీ మంత్రి మీద లుకౌట్ నోటీసులు జారీచేయడంలో పోలీసులు ఆలస్యం చేశారనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఆయన ఈపాటికి కుటుంబం సహా దేశం దాటి వెళ్లిపోయి ఉంటారనే అభిప్రాయం కూడా పలువురికి కలుగుతోంది.

క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో కాకాణి గోవర్దనరెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. కేసులు నమోదు అయిన సందర్భంలో పోలీసుల మీద తెగ రెచ్చిపోయి వ్యాఖ్యలు చేసిన కాకాణి.. తీరా నోటీసుల పర్వం వచ్చేసరికి అరెస్టు భయంతో వణికిపోతున్నారు. పాపిరెడ్డి పల్లిలో జగన్ ఏరకంగా రెచ్చిపోయారో.. అదే దూకుడును..
ఆయన పరారీలోనే ఉంటూ మరోవైపు హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషను నడిపారు. సుదీర్ఘ వాద ప్రతివాదాల తర్వాత ఆ బెయిలు పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. తనకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, అసలు తనపైన నమోదైన కేసును కూడా కొట్టివేయాలి అని కూడా మరో అనుబంధ పిటిషన్ వేశారు. దానిని కూడా కోర్టు తిరస్కరించింది.

అప్పటిదాకా పోలీసులకు కనీసం ఫోనుకు కూడా చిక్కకుండా.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయినందున.. పోలీసులు జాగ్రత్తపడి ఉంటే.. అప్పుడే లుకౌట్ నోటీసులు జారీ చేసి ఉండాల్సింది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. కాకాణికి నోటీసులు ఇవ్వాలనే ప్రహసనం ఇప్పటికే రెండు వారాలుగా జీడిపాకం సీరియల్ లాగా సాగుతూ ఉంది. తొలుత నెల్లూరులోని ఆయన రెండు ఇళ్లకు వెళ్లిన పోలీసులకు తాళాలే దర్శనమిచ్చాయి. అయితే ఉగాది పండుగను హైదరాబాదులో బంధువుల ఇంట్లో జరుపుకున్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి.. కాకాణి పోలీసులకు లీడ్ ఇచ్చారు. వారు హైదరబాదు పోలీసుల ఇంటికి వచ్చేసరికి అక్కడినుంచి కూడా పరారయ్యారు.

అప్పటినుంచి ఈ దాగుడుమూతల ఆట నడుస్తూనే ఉంది. ఆరోజే లుకౌట్ నోటీసులు ఇచ్చేసి ఉంటే ప్రయోజనం ఉండేదని.. రెండు వారాలు నాన్చినందువల్ల ఈ పాటికి విదేశాలకు వెళ్లిపోయి ఉండచ్చునని అనుకుంటున్నారు. పోలీసులు బృందాలుగా ఏర్పడి చైన్నై, బెంగుళూరు, హైదరాబాదు నగరాల్లో ఆయనకోసం గాలించినా ఫలితం దక్కలేదు. 

Related Posts

Comments

spot_img

Recent Stories