ఓజీలో కొత్త పాట కోసం ఎదురుచూపులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన సుజీత్ దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజి” బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. రిలీజ్ అయిన కొద్దిసేపటిలోనే ఈ సినిమా మంచి టాక్ సంపాదించి, ఇప్పుడు 300 కోట్ల మార్క్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. పవన్ స్టామినా వల్లే కాదు, మాస్ యాక్షన్ సీక్వెన్సులు కూడా థియేటర్స్ లో ఎనర్జీని పెంచుతున్నాయి.

ఇక ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు మేకర్స్ ఓ ప్రత్యేక గిఫ్ట్ ఇచ్చారు. నిన్న సాయంత్రం నుంచే స్క్రీనింగ్స్ లో కొత్త పాటను చూపించారు. “కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్” అంటూ సాగిన ఈ పాటలో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్ తో ఆకట్టుకుంది. థమన్ అందించిన బీట్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులు స్టెప్పులు వేసేంతగా స్పందించారు. ఇప్పుడు ఈ సాంగ్ పూర్తి ఆడియోని రిలీజ్ చేయాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రకాష్ రాజ్, శ్రేయా రెడ్డి, అర్జున్ దాస్ లాంటి నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories