పెద్ది కోసం లాంగ్‌ షెడ్యూల్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘పెద్ది’ పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా లాంగ్ షెడ్యూల్ కోసం దర్శకత్వ టీమ్ ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో చరణ్ యాక్షన్ సీన్స్ తో పాటు ఒక ప్రత్యేక పాటను కూడా చిత్రీకరించబోతున్నాడు.

సినిమాలో చరణ్ డ్యూయల్ పాత్రల్లో కనిపించనున్నాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే రెండో పాత్ర సన్నివేశాలు ఈ షెడ్యూల్‌లో షూట్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన చిత్రాలతో పోలిస్తే, ఈ సినిమా కథ మరియు ప్రదర్శనలో పూర్తిగా కొత్తగా ఉండబోతోంది.

‘పెద్ది’ వచ్చే సంవత్సరం మార్చి 27న రిలీజ్ అవుతుంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తూ, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ వంటి ఇతర ప్రధాన పాత్రధారులు కూడా సినిమాలో కనిపించనున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories