తమిళ సినీ పరిశ్రమలో ఈ మధ్య కాలంలో బాగా డిమాండ్ లో ఉన్న దర్శకుల్లో లోకేశ్ కనగరాజ్ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ, తన యాక్షన్ ప్యాక్‌డ్ సినిమాలతో ప్రేక్షకులకి కొత్త అనుభూతి ఇచ్చిన లోకేశ్.. ఇప్పుడు రజినీకాంత్ హీరోగా నటిస్తున్న “కూలీ” అనే చిత్రంతో మళ్లీ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
ఈ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న లోకేశ్, అజిత్‌తో సినిమా చేసే అవకాశాలపై స్పందించాడు. అజిత్‌ను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడతానని, సరైన సమయం వచ్చినప్పుడు తమ కాంబినేషన్ ఖచ్చితంగా తెరపైకి వస్తుందని చెప్పాడు.
ఇప్పటికే కమల్ హాసన్, రజినీకాంత్ వంటి లెజెండ్స్‌తో కలిసి పని చేసిన లోకేశ్.. తలపతి విజయ్‌తో అయితే రెండు సినిమాలు చేశాడు. ఇప్పుడు అభిమానుల దృష్టి అజిత్‌పై పడింది. వీరిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఈ కాంబినేషన్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక్కసారి ప్రాజెక్ట్ ఫిక్స్ అయితే మాత్రం, దానికి భారీ స్థాయి ఆసక్తి ఏర్పడటం ఖాయం.