లోకేష్- రజినీ మూవీ టైటిల్‌ ఫిక్స్!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్‌ కనగరాజ్ ప్రస్తుతం రజినీకాంత్‌ తో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ప్రస్తుతం వర్కింగ్‌ టైటిల్ గా తలైవర్ 171 ని అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది.

ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ టీజర్ విడుదల గురించి ఓ క్లారిటీ ఇచ్చింది. ఏప్రిల్‌ 22న ఈ సినిమా టైటిల్‌ ను రివీల్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించానికి చిత్రం బృందం ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో రజినీ కొత్త లుక్ తో ఉండగా.. ఈ పోస్టర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది.

చేతులకు బేడీలతో స్టైల్‌ గా ఉన్నారు. ఈ పోస్టర్ చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. రజినీ లుక్‌ చాలా కొత్తగా ఉందని పేర్కొంటున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories