అందులో లిటిల్‌ హార్ట్స్‌ సందడి!

టాలీవుడ్ నుంచి ఇటీవల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న సినిమాల్లో లిటిల్ హార్ట్స్ కూడా ఒకటి. ఈ సినిమాలో యూట్యూబ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న మౌళి తనూజ్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్‌గా నటించారు. థియేటర్స్‌లో రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ నచ్చి మంచి హిట్‌గా నిలిచింది. కలెక్షన్ల పరంగా కూడా మేకర్స్‌కి, డిస్ట్రిబ్యూటర్స్‌కి మంచి లాభాలు తీసుకొచ్చి బ్లాక్ బస్టర్‌గా రాణించింది.

ఇప్పుడేమో థియేటర్ రన్ పూర్తయ్యాక ఈ చిత్రం ఓటిటీలో స్ట్రీమింగ్‌కి వచ్చింది. ఈటీవీ విన్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసి, నేటి నుండి ప్రేక్షకుల కోసం రిలీజ్ చేసింది. ముఖ్యంగా థియేటర్స్‌లో చూసిన కంటెంట్‌తో పాటు, కొన్ని అదనపు కామెడీ సీన్స్‌తో ఈసారి ఓటిటీలో అందుబాటులోకి తెచ్చారు.

ఈ సినిమాకు సాయి మార్తాండ్ దర్శకత్వం వహించగా, ఆదిత్య హాసన్ నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

Related Posts

Comments

spot_img

Recent Stories