ఒకే ఫ్రేములో చిరు-బాలయ్య!

టాలీవుడ్‌ లో కొన్ని కొన్ని కలయికలు అభిమానులకు మంచి కిక్‌ ఇస్తాయి. ఒక స్టార్ హీరో సినిమాకు మరొక స్టార్ హీరో గెస్ట్ గా వస్తే సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్‌ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఒకప్పటి మన స్టార్ హీరోలు ఇటీవల కాలంలో ఒకే వేదికపై కనిపించడం చాలా కాలం అయ్యింది.

ఈ నేపథ్యంలో బాలయ్య నిర్వహించే అన్ స్టాపబుల్ షో ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకీ సందడి చేయనున్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అభిమానులు  ఆనందం వ్యక్తం చేసారు. కానీ అంతకంటే ముందుగా వారి ఆనందాన్ని కాస్త ముందుగానే అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి. ఒకే ఫ్రేములో చిరు, బాలయ్య కలిసి తాజాగా సందడి చేసారు. టాలీవుడ్ ప్రముఖ లిరిసిస్టు రామ జోగయ్య శాస్త్రి కుమారుడి వివాహ రిసెప్షన్ హైదరాబాద్ దశపల్లా హోటల్లో వేడుకగా జరిగింది.

ఈ వేడుకకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో బాలయ్య చిరు కలుసుకున్న సందర్భం ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. బోయపాటి తో కలిసి వచ్చిన బాలయ్య ఆసీనులై ఉండగా మెగాస్టార్ చిరు రావడంతో ఒకరినొకరు పలకరించుకుని ఆత్మీయంగా కరచాలనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇక మరి కొద్ది రోజుల్లో మొదలు కానున్న అన్ స్టాపబుల్ టాక్ షో లో మెగాస్టార్ ఎపిసోడ్ దెబ్బకు ఆహా మరోసారి క్రాష్ అవ్వడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories