మెగా ఫ్యామిలీలో ఆనందం అలుముకుంది. వరుణ్ తేజ్, లావణ్య దంపతులకు ఈ రోజు పండంటి మగబిడ్డ జన్మించాడు. కొణిదెల కుటుంబానికి కొత్త వారసుడి రాకతో ఇంట్లో ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొంది. చిన్నారితో పాటు లావణ్య కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక బాబును మొదటగా ఆశీర్వదించిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందున్నారు. కుటుంబంలోకి కొత్తగా వచ్చిన ఈ వారసుడిని ఆనందంగా స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. తల్లిదండ్రులుగా మారిన వరుణ్-లావణ్యకు, తాత-అమ్మమ్మలుగా మారిన నాగబాబు-పద్మజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
కొత్తగా పుట్టిన మనవడిని తన చేతుల్లోకి ఎత్తుకున్న చిరంజీవి సంతోషంతో మురిసిపోయారు. ఆ ప్రత్యేక క్షణాన్ని ఆయన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు.