లింక్డిన్ ర్యాంకులు కూటమి సర్కారుకు కితాబులే!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయిదేళ్ల పదవీకాలంలో.. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి జరగలేదు. ఒక్క ప్రాజెక్టు, పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం కల్పన జరగలేదు. అలాంటి దుర్మార్గమైన పాలనను ప్రజలు ఏమాత్రం సహించలేకపోయారు గనుకనే.. ఆయనను 11 సీట్లు మాత్రమే గెలిచిన పార్టీకి నాయకుడిగా, ఒక సాధారణ ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారు రాష్ట్ర ప్రజలు. కానీ చంద్రబాబునాయుడు సారథ్యంలో ఎన్డీయే కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఉపాధి, ఉద్యోగాల పరంగా రాష్ట్రం శరవేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. రాబోయే అయిదేళ్ల కాలంలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామనే అదిపెద్ద  హామీతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తొలిరోజు నుంచి ఆదిశగా అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక ప్రాజెక్టులు సాధించుకు వస్తున్నారు. ఈ ఫలితాలు.. నాయకుల మాటల్లో మాత్రమే కాదు.. లింక్డ్ఇన్ సంస్థ నిర్వహించిన నివేదికలో కూడా స్పష్టం అవుతుండడం గొప్ప విషయం.

ఉద్యోగాల కల్పన, ఉద్యోగార్థులకు సంధానకర్తగా వ్యవహరించే విషయంలో అంతర్జాతీయంగా విశ్వసనీయత ఉన్న లింక్డ్ ఇన్ సంస్థ తొలిసారిగా ‘సిటీస్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో ఒక నివేదికను రూపొందించారు. ఉద్యోగాల కల్పనలో అసాధారణ స్థాయిలో వృద్ధి చెందుతున్న నగరాల జాబితాను ఈ నివేదికలో పొందుపరిచారు. ఇందులో విశాఖపట్టణం నగరానికి మొదటి ర్యాంకు దక్కగా, విజయవాడకు మూడో ర్యాంకు దక్కింది. వాస్తవంగా గమనించినప్పుడు లింక్డ్ ఇన్ నివేదికలో ఈస్థాయి ర్యాంకులు ఏపీలోని రెండు కీలక నగరాలకు దక్కడం అనేది.. ఉద్యోగాల కల్పన పరంగా కూటమి ప్రభుత్వం పడుతున్న శ్రమకు అతిపెద్ద కితాబు అని విశ్లేషకులు భావిస్తున్నారు.

చంద్రబాబునాయుడు కూడా లింక్డ్ ఇన్ నివేదిక పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ర్యాంకులు రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో కూడిన నూతన పారిశ్రామిక విధానాల ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని’ ఆయన ఎక్స్ లో పేర్కొన్నారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద సంస్థలు విశాఖలో తమ క్యాంపస్ లు ఏర్పాటుచేయబోతున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే క్వాంట్ వ్యాలీ, ఏఐ యూనివర్సిటీ వంటివి కూడా ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి ఐటీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలుస్తుందని చంద్రబాబునాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పుడు విశాఖ, విజయవాడ నగరాలు లింక్డ్ ఇన్ జాబితాలో మొదటి, మూడో స్థానాల్ని దక్కించుకున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణ వ్యవహారం కొన్నేళ్లలో ఒక కొలిక్కి వచ్చి.. ప్రభుత్వం చెబుతున్న స్మార్ట్ పరిశ్రమలు అన్నీ వస్తే గనుక.. అమరావతి నగరం కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకుంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories