పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు. అయితే ఎన్నో అంచనాలు ఉన్న ఈ మూవీ ఎట్టకేలకు విడుదలవుతుంది. అనుకుంటే చివరి నిమిషంలో థియేటర్స్ మూసివేత ఊహించని ట్విస్ట్ గా నిలిచింది.
అయితే ముందు ఇదేది ఉండదు అనే టాక్ వినిపించింది. కానీ మొన్న ఫిలిం ఛాంబర్ లో జరిగిన సమావేశం అంత సానుకూలంగా జరగకపోవడం అనేది మరో ట్విస్ట్. అయితే ఈ డ్రామా వెనుక ఒక నలుగురు నిర్మాతలు ఉన్నారంటూ ప్రచారం నడుస్తోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ సినిమాను కావాలనే అడ్డుకునే యత్నం అంటూ మరో షాకింగ్ విషయం సోషల్ మీడియాలో ఓ విషయం చక్కర్లు కొడుతుంది
అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందించి దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటో కనుక్కోవాలి అని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇప్పుడు పరిస్థితులు మరింత రసవత్తరంగా మారాయి.