ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో రకరకాల క్రేజీ కాంబినేషన్ లు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో ఒకటి మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు నటనతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతిల కలయిక. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ లో మంచి భాగం పూర్తయ్యిందని సమాచారం. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్ నుంచి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ ప్రాజెక్ట్ కి సంగీతం అందిస్తున్న వ్యక్తి గురించి మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా హర్ష వర్ధన్ రామేశ్వర్ ఎంపికయ్యాడు. తాజాగా “అనిమల్” చిత్రానికి ఇచ్చిన సంగీతం వల్ల జాతీయ అవార్డు అందుకున్న ఆయన, ఇప్పుడు పూరి జగన్నాథ్ తో జతకట్టడం సినిమా మీద మరింత ఆసక్తిని పెంచింది. పూరి సినిమాల్లో ఉండే ఎనర్జీ, మాస్ ఎలిమెంట్స్ కి హర్ష వర్ధన్ సంగీతం ఎలా సరిపోతుందో చూడాలి.
ఇక మరోవైపు త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా ఇదే సంగీత దర్శకుడు ఉండబోతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.