విశ్వంభర సినిమా పై తాజా అప్డేట్!

టాలీవుడ్‌ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కథానాయికగా బింబిసార ఫేమ్‌ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ సినిమా విశ్వంభర. ఈ సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా మెగాస్టార్‌ కెరీర్ లో 156 వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి అప్డేట్‌ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం ప్రస్తుతం చిరు, యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ మధ్య కొన్ని కీలక సన్నివేశాలని వశిష్ట తెరకెక్కిస్తున్నాడని సమాచారం. తాజాగా ఈ సినిమా బృందం సినిమాటోగ్రాఫర్‌ ఛోటా కే నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణబాధ్యతలు వహిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా చిత్ర బృందం కన్ఫార్మ్ చేసింది.

Related Posts

Comments

spot_img

Recent Stories