విశ్వంభర పై లేటెస్ట్‌ అప్డేట్‌!

టాలీవుడ్ పద్మవిభూషణుడు మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా,  త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన భారీ ఫాంటసీ యాక్షన్ సినిమా “విశ్వంభర”.  ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ అలాగే డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఇలా అన్నీ ఏకకాలంలో సాగితున్నాయి.

ఇక ఈ సినిమాపై ఇపుడు లేటెస్ట్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం సినిమాలో రెండు పాటలు షూటింగ్ మినహా మిగతా అంతా పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. ఇవి కూడా అతి త్వరలోనే పూర్తి చేసేసి ఈ జనవరి బరిలోనే సినిమాని దింపే సన్నాహాలను మూవీ మేకర్స్ చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories