భారతీయుడు 3 విడుదల పై తాజా సమాచారం!

కమల్ హాసన్ నటించిన క్లాసిక్ సినిమాల్లో ‘భారతీయుడు’ అనే చిత్రం ప్రత్యేకంగా గుర్తుంచుకుంటారు. దర్శకుడు శంకర్ తీసిన ఈ సినిమాకు అప్పట్లో తెలుగులోనూ భారీ స్పందన వచ్చింది. దేశభక్తితో పాటు అవినీతి మీద ఘాటు సందేశాన్ని ఇచ్చిన ఈ సినిమా, ఇప్పటికీ చాలామందిలో మంచి గుర్తుండిపోయింది.

ఇలాంటి హిట్ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘భారతీయుడు 2’ మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ, విడుదల తర్వాత మాత్రం ఆ అంచనాలకు అందకుండా పోయింది. కథనం, ఎడిటింగ్, భావోద్వేగాల లోపాలతో విమర్శలు ఎదురయ్యాయి. అయితే ఆఖరి భాగంలో చూపించిన సీన్ చూసిన ప్రేక్షకులు మూడో భాగం మీద ఆశలు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో ‘భారతీయుడు 3’ పై ఇప్పటికీ చర్చలు కొనసాగుతున్నాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శంకర్ మళ్లీ దీనిని పెద్ద తెరపైనే చూపించాలనే ఉద్దేశంతో ఉన్నారు. పైగా ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో థియేటర్లలో విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో బజ్ వినిపిస్తోంది.

అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అయినప్పటికీ, శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్‌లో మరోసారి ఆసక్తికరమైన కథను తెరపై చూడాలని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల్లో హైప్ మాత్రం తగ్గడం లేదు.

Related Posts

Comments

spot_img

Recent Stories