కమల్‌-రజినీ ప్రాజెక్ట్‌ పై తాజా సమాచారం..!

కోలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద కాంబినేషన్ గా చెప్పుకునే ప్రాజెక్ట్ రాబోతుందన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఇద్దరూ కలిసి నటించబోతున్న సినిమాకి దర్శకుడు లోకేష్ కనగరాజ్ కమాండ్ తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే విక్రమ్, కూలీ వంటి సినిమాలతో పాపులర్ అయిన లోకేష్, ఈసారి ఇద్దరు లెజెండరీ స్టార్స్‌ని ఒకే స్క్రీన్‌పైకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాడట. అయితే ఈ ప్రాజెక్ట్ నిజానికి సహజంగానే కాకుండా, కొంత ఫోర్స్డ్‌గా ఫిక్స్ అయినట్టు ఫిలింనగర్ టాక్ వినిపిస్తోంది. కూలీకి వచ్చిన మిక్స్‌డ్ రెస్పాన్స్‌ కారణంగా, గ్యాప్ లేకుండా వెంటనే ఈ పెద్ద కాంబినేషన్ మీదే దృష్టి పెట్టాలని లోకేష్ నిర్ణయించుకున్నాడని చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం లోకేష్ టీమ్ బిజీగా ఉందని సమాచారం.

Related Posts

Comments

spot_img

Recent Stories