నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ అఖండ 2 కి సంబంధించి క్రేజీ హైప్ నెలకొంది. బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో స్పెషల్ ఆసక్తి ఉంటుంది. ఇక ఈ జోడీకి మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.
ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ తమ తదుపరి షెడ్యూల్‌ను ప్రయాగరాజ్‌లో ప్లాన్ చేస్తోంది. అక్కడ సుమారు రెండు వారాల పాటు ఇంటెన్స్‌గా షూటింగ్ జరగనుందని సమాచారం. దీంతో షూటింగ్ పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.
ఇక రిలీజ్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది. మేకర్స్ ఈ సినిమాను సెప్టెంబర్ 25న పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మాణం చేపట్టింది.
అఖండ 2లో బోయపాటి మాస్ మేకింగ్‌తో పాటు కొత్త యాంగిల్స్‌ను కూడా చూపించనున్నారట. మొత్తానికి ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో మరో భారీ హిట్ అవుతుందనే అంచనాలు నెలకొన్నాయి.