టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన చిత్రాల్లో రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” సినిమా ముందుంటుంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో దూసుకుపోతోంది.
ఇటీవల సినీ కార్మికుల సమ్మె కారణంగా కొంత విరామం తీసుకున్న ఈ చిత్ర యూనిట్, మళ్లీ కొత్త షెడ్యూల్ కోసం రంగం సిద్ధం చేసుకుంటోంది. వచ్చే మంగళవారం నుంచి మైసూరు లోకేషన్లలో చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ షెడ్యూల్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ టాక్ వినపడుతోంది.