కండిషన్లతో భూములు: అభివృద్ధిలో వేగానికే ప్రాధాన్యం!

ఒకవైపు రాష్ట్ర హైకోర్టు కూడా.. ప్రోత్సాహకాలు ఇవ్వకుండా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ స్థాయి సంస్థలు, పెద్ద పారిశ్రామిక వేత్తలు ఎందుకు మందుకు వస్తారు.. అంటూ సానుకూల దృక్పథంతో మాట్లాడుతోంది. భూములను కేటాయించే విషయంలో, అతి తక్కువ ధరకు సంస్థలకు భూములు ఇవ్వడంలో ప్రభుత్వం వైఖరికి మద్దతుగానే వ్యాఖ్యలు చేస్తోంది. అయినా సరే.. రాష్ట్రంలో ఒక కొత్త సంస్థ ఏర్పాటు కావడమే తనకు కిట్టని వ్యవహారం అన్నట్టుగా, సైంధవుల్లాగా అడ్డుపడుతూ ఉంటాయి జగన్మోహన్ రెడ్డ దళాలు. కూటమి ప్రభుత్వం మాత్రం ఈ విఘ్నాలను, విమర్శలను పట్టించుకోకుండా.. అభివృద్ధి దిశగా తాము తలచిన విధంగా అడుగులు వేసుకుంటూ వెళుతోంది. అంతకంటె సంతోషకరమైన విషయం ఏంటంటే.. భూ కేటాయింపులకు కూడా ప్రభుత్వం కొన్ని నిర్దిష్టమైన నియమాలు, గడువులు విధిస్తోంది. ఈ పోకడ వలన.. అభివృద్ధిలో ఎంతో వేగం కనిపిస్తుందనే ఆశ ప్రజల్లో కలుగుతోంది.

తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో  విట్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు అదనగా చెరొక వంద ఎకరాల వంతున భూకేటాయింపులు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. డెంటల్, మెడికల్, పారా మెడికల్ కళాశాలల ఏర్పాటుకు అనుకూలంగా ఈ స్థలాల కేటాయింపు చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. ఇప్పటికే ఈ యూనివర్సిటీలు అమరావతిలో తమ తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. అయితే కొత్త కేగాయింపులకు ప్రభుత్వం పెట్టిన నిబంధన ఏంటంటే.. ఈ రెండు సంస్థలు కూడద 17వేల మందితో నడిపిన తర్వాత మాత్రమే అదనపు భూమిని కేటాయిస్తారు. అంటే.. ఆ సంస్థలు విధిగా వాటి పూర్తి స్థాయి కార్యకలాపాలను ప్రారంభించిన తర్వాత మాత్రమే అదనంగా పొందడానికి అర్హత ఉంటుందన్నమాట. ఈ అవకాశం వినియోగించుకోవాలంటే.. వారు తమ పనులను వేగంగా జరిపించాల్సి వస్తుంది.

ఐటీ సంస్థలకు భూములు కేటాయించే నూతన పాలసీని కూడా ప్రభుత్వం రెండు రోజుల కిందట ప్రకటించింది. ఈ పాలసీ ప్రకారం కూడా ఇలాంటి నిబంధనలు విధించారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి చెందిన సంస్థలకు, బిలియన్ డాలర్లలో టర్నోవర్ కలిగి ఉన్న సంస్థలకు మాత్రమే ఎకరా 99 పైసల వంతున కేటాయించడానికి పాలసీ రూపొందించారు. అయితే ఈ కేటాయింపులు కూడా ప్రతి ఎకరాకు కనీసం 500 ఉద్యోగాలను కేటాయించగలిగే నిబంధన మీద మాత్రమే. అలాగే తొలి మూడేళ్లలోనే వారు కనీసం మూడువేల ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది. భూముల కేటాయింపులు, పెట్టుబడిదార్లకు ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాల విషయంలో అలాంటి నిబంధనలు విధించడం వల్ల అభివృద్ధిలో వేగం పెరుగుతుంది. భూములు తీసుకునే సంస్థలు వెంటనే తమ పనులు ప్రారంభిస్తాయి. తద్వారా.. ఈ అయిదేళ్ల పదవీకాలంలో 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలన్న కూటమి ప్రభుత్వం ఆశయం కూడా నెరవేరుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories