లైలా..ఓ ఫన్ రైడర్! యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’ ఫిబ్రవరి 14న గ్రాండ్ విడుదలకు సిద్దం అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి.
ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ మూవీ పై అంచనాలను భారీగా పెంచాయి. అయితే, తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌గా కట్ చేశారు మూవీ మేకర్స్. సోను మోడల్ పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్.. అతడు చేసే కామెడీ ఆకట్టుకుంటుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
ఇక అతడు ఎదుర్కొనే సమస్యల కారణంగా లైలా గా ఎందుకు మారాడు అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే. అయితే, లేడీ పాత్రలో విశ్వక్ సేన్ చేసే అల్లరి మామూలుగా ఉండబోదని చిత్ర యూనిట్ ఈ ట్రైలర్‌లో చెప్పకనే చెప్పారు. అటు హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకోనుంది.