మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న తాజా సినిమా ‘లైలా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ తొలిసారి ఓ లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ ఆసక్తికి తెరదించుతూ లైలా చిత్ర టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.
ఈ సినిమాలో సోనూ మోడల్ అనే పాత్రలో నటిస్తున్న విశ్వక్ సేన్ లేడీస్ బ్యూటీ పార్లర్‌లో ఆడవారికి మేకప్ చేస్తూ వారిని ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇక మాస్ డైలాగులతో విశ్వక్ మరోసారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. తనదైన మ్యానరిజంతో విశ్వక్ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక లేడీ గెటప్‌లోనూ విశ్వక్ సేన్ సూపర్ ఉన్నాడు. పూర్తి మాస్ అండ్ ట్రెండీ కంటెంట్‌తో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించినట్లు ఈ టీజర్ చూస్తే తెలిసిపోతుంది.