డ‌బుల్ ఇస్మార్ట్’ నుంచి ”క్యా ల‌ఫ్డా” సాంగ్ వచ్చేసిందోచ్‌!

యంగ్ అండ్ ఎన‌ర్జీటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని న‌టించిన తాజా చిత్రం ‘డ‌బుల్ ఇస్మార్ట్’ ఇప్పటికే షూటింగ్ ప‌నులు ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను డ్యాషింగ్ మాస్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ డైరెక్ట్ చేస్తుండ‌టంతో ఈ సినిమాపై అంచ‌నాలు నెక్ట్స్ లెవెల్ లో క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా నుండి వ‌రుస అప్డేట్స్ ఇస్తూ మూవీ మేక‌ర్స్ అభిమానుల‌ను ఫుల్‌ ఖుషీ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి మ‌రో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ”క్యా ల‌ఫ్డా” అనే సాంగ్ ప్రోమోను తాజాగా అభిమానుల ముందుకు తీసుకుని వచ్చారు. శ్రీ‌హ‌ర్ష ఈమ‌ని లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను ధ‌నుంజ‌య్, సింధుజ శ్రీ‌నివాస‌న్ క‌లిసి ఈ పాటను పాడారు. ఇక మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న మ్యూజిక్ తో మ్యాజిక్ చేయ‌నున్నాడని ఈ ప్రోమో చూస్తే తెలుస్తుంది.

ఈ సినిమాలో అందాల భామ కావ్య థాప‌ర్ హీరోయిన్ గా నటిస్తోండ‌గా బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ విల‌న్ పాత్ర‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. గెటప్ శ్రీ‌ను, అలీ, షాయాజీ షిండే, మార్కండ్ దేశ్పాండే, టెంప‌ర్ వంశీ వంటి వారు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories