ఇదేం కోరిక చిన్న కూతురా…షాక్‌ లో నెటిజన్లు!

అతిలోక సుందరి శ్రీదేవి చిన్నకూతురు ఖుషి కపూర్ ఇటీవల ది ఆర్చీస్‌ అనే సినిమాతో సినీ ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చింది. 2023లో విడుదలైన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ఈ సినిమా ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. అయితే ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందిపుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేసి స్టార్ హీరోయిన్లకు ఉన్నంత క్రేజ్ తెచ్చుకుంది.

ఈ అమ్మడు అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియా లో సెన్సేషన్‌గా మారిపోయింది. ఖుషి అందాలకు కుర్రాళ్లు కూడా ఫిదా అయిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఖుషి కపూర్ తన వింత కోరిక బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్వెటర్‌ ధరించిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘స్వెటర్ వేసుకునే వాతావరణం కోసం వేచి చూస్తున్నాను’’ అని కింద క్యాప్షన్ రాసింది.  ప్రస్తుతం ఈ అమ్మడు పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఇదేం వింత కోరిక తల్లి అంటూ  కామెంట్లు పెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories