టాలీవుడ్ మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా చేస్తున్న అవైటెడ్ చిత్రమే “కుబేర”. ప్రకటించినప్పటి నుంచి కూడా మంచి హైప్ ని అందుకున్న ఈ మూవీ గురించి అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగు ఆడియెన్స్ కూడా అంతే ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. మరి కొన్నాళ్ల నుంచి సాలిడ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు మొదటి సాంగ్ రిలీజ్ పై అప్డేట్ ఇచ్చేసారు.
రేపు ఏప్రిల్ 15న ఫస్ట్ సింగిల్ ప్రోమోని రిలీజ్ చేస్తుండగా ఫుల్ సాంగ్ ని ఈ ఏప్రిల్ 20న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక అప్డేట్ కి ధనుష్ పై ఓ సెలబ్రేటింగ్ పోస్టర్ ని కూడా వదిలి అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచారని చెప్పవచ్చు. శేఖర్ కమ్ముల, ధనుష్, ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ల మ్యూజిక్ టేస్ట్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
మరి వీరంతా కలిసి చేస్తున్న ఈ సినిమా పాటలు ఎలా ఉంటాయో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కూడా నటిస్తుండగా ఆసియన్ సునీల్ నారంగ్ అలాగే పుష్కర్ రామ్ మోహన్ రావులు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం జూన్ 20న విడుదలకి రాబోతుంది.