కుబేర ..షాకింగ్‌ రన్‌ టైం!

ఈ జూన్ నెలలో రిలీజ్ కి రాబోతున్న లేటెస్ట్ చిత్రాల్లో కోలీవుడ్ టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో మ్యాజికల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “కుబేర” కూడా ఒకటి. అయితే తెలుగు సహా తమిళ్ లో కూడా మంచి బజ్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది.

దీంతో కుబేర సినిమాకి షాకింగ్ రన్ టైం లాక్ అయ్యినట్టుగా తెలుస్తుంది. మేకర్స్ ఈ చిత్రాన్ని దగ్గరదగ్గరగా మూడు గంటల నిడివికి తగ్గించారు. ఈ సినిమా 2 గంటల 50 నిమిషాల మేర రన్ టైం తో రాబోతున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. మరి దీనిపై మరింత క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆసియన్ సునీల్ అలాగే శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు ఈ చిత్రాన్ని నిర్మాణం వహించగా ఈ జూన్ 20న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories