వీరమల్లు పై స్పందించిన క్రిష్‌!

పవన్ కళ్యాణ్ నటించిన భారీ హిస్టారికల్ చిత్రంగా రూపొందిన “హరిహర వీరమల్లు” విడుదలకు చివరి ఘట్టంలోకి వచ్చింది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు చాలా మలుపులు తిరిగాయి. ప్రారంభంలో ఈ ప్రాజెక్ట్‌ను దర్శకుడు క్రిష్ తీసుకెళ్లగా, మిడిల్‌లో కొన్ని అడ్డంకులు వచ్చాయి. దాంతో సినిమా పూర్తి బాధ్యతను యువ దర్శకుడు జ్యోతికృష్ణ చేపట్టి చిత్రాన్ని పూర్తిచేశారు.

క్రిష్ తొలుత ఈ సినిమా తెరకెక్కించినప్పటికీ, చిత్ర పరిశ్రమలో కొన్ని మార్పులు, రాజకీయ బాధ్యతల నేపథ్యంలో ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి నిశ్శబ్దంగా తప్పుకున్నారు. అప్పటినుంచి సినిమాపై ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడంతో ఆయన స్పందన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే చిత్ర విడుదల సమీపిస్తున్న వేళ, ఎట్టకేలకీ క్రిష్ తన అభిప్రాయం వెల్లడించారు.

వీరమల్లు ఓ సినిమా మాత్రమే కాదు, మర్చిపోయిన చరిత్రను తిరిగి గుర్తుచేసే ప్రయత్నం అని ఆయన భావించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తాను దర్శకుడిగా మాత్రమే కాకుండా, ఓ రీసర్చర్‌గా కొన్ని నిజాల్ని తెలుసుకున్నానని చెప్పారు. ఈ కథను రూపొందించడంలో భారీ యుద్ధాల్లా అనుభవాలు ఎదురయ్యాయని, కానీ తాను ఈ ప్రయాణాన్ని ప్రేమతో కొనసాగించానని చెప్పారు.

పవన్ కళ్యాణ్, నిర్మాత ఏఎం రత్నం వంటి వ్యక్తులు ఈ సినిమాకి ప్రాణం పోసారని, వాళ్లతో పనిచేయడం తనకు ఓ ప్రత్యేక అనుభవంగా మిగిలిందని కూడా ఆయన పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే, క్రిష్ మళ్లీ వీరమల్లుపై స్పందించడం చిత్ర వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

ఇప్పుడు ప్రేక్షకులంతా ఆశగా ఎదురు చూస్తున్నది – ఈ చారిత్రక గాధ వెండితెరపై ఎలా కనిపించబోతుందో అన్నదే.

Related Posts

Comments

spot_img

Recent Stories