జగన్ మీద కోటంరెడ్డి సెటైర్లు మామూలుగా లేవుగా..?

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. చాలా దూకుడుగా వ్యవహరించే నాయకుల్లో ఒకడు. అదే సమయంలో ఆయన ప్రజల సమస్యల విషయంలో చాలా మొండిగా కూడా ప్రవర్తిస్తుంటారు. ప్రజలకు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి తీరాలని అనుకుంటూ ఉంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కావాలని గట్టిగా అడిగినందుకు జగన్ ఆయనను పక్కన పెట్టారు. చివరికి తెలుగుదేశంలో చేరి మళ్లీ గెలిచారు ఆయన. అలాంటి కోటంరెడ్డి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఎడా పెడా సెటైర్లు వేస్తున్నారు.

వైఎస్ జగన్ శాసనసభకు రాకపోవడంపై ప్రజలు మాత్రమే కాదు.. ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలలో కూడా అసెంబ్లీ లాబీల్లో రోజూ జోకులు పేలుతూనే ఉంటాయి. కోటంరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. జగన్ కు ఒక నమస్కారం పెట్టాలని ముచ్చటపడుతున్నానని, అయితే ఆయన సభకే రావడం లేదని అన్నారు. ఆయన సభకు రావాలంటే.. ఆయన ఏం మాట్లాడినా సరే అడ్డుచెప్పబోం అని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలేమో అని వెటకారం చేశారు.
ప్రతి రోజూ గంట సేపు మాట్లాడేందుకు అనుమతిస్తాం అని స్పీకరు లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప.. వైసీపీ అధ్యక్షుడు శాసనసభ సమావేశాలకు వచ్చేలా లేరని కోటం రెడ్డి వ్యాఖ్యానించడం విశేషం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తాను తప్ప మరెవ్వరూ కూడా మాట్లాడకూడదనేది జగన్ తత్వం అంటూ కోటంరెడ్డి మరో సీక్రెట్ కూడా బయటపెట్టారు. 2014-19 మధ్య కాలంలో  కూడా జగన్ నిత్యం తనకు మైక్ కావాలని గొడవ పడేవారే తప్ప.. ప్రజల సమస్యలకోసం ఆయన కొట్లాడిన సందర్భాలు చాలా తక్కువ అని కోటంరెడ్డి గుర్తుచేశారు.
‘ప్రతిపక్ష నేతగా హోదా లేకపోతే.. సభలో ప్రజా సమస్యలను ప్రస్తావించఃడం కుదరదు. తమకు మైక్ ఇవ్వరు’ అని సాకులు చెప్పి జగన్ ఇంట్లో కూర్చోవడానికి నిర్ణయించుకున్న తొలి నాటినుంచి ఆయన వాదన రకరకాలుగా నవ్వులపాలు అవుతోంది. ప్రతిపక్ష నేత హోదా ఉన్నంత మాత్రాన కూడా గంటలకొద్దీ మైక్ ఇవ్వడం సాధ్యం కాదు కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల శాసనసభ లాబీల్లో ప్రతిరోజూ ఎవరో ఒకరు జోకులు వేసుకోవడానికి సరిపడిన ముడిసరుకుగా తయారయ్యారని పలువురు అంటున్నారు. 

Related Posts

Comments

spot_img

Recent Stories