కేవలం అక్రమాలు అవినీతి వ్యవహారాలు మాత్రమే కాదు.. జగన్ ప్రభుత్వ కాలంలో దారితప్పిన వ్యవహారాలు, ఎలాంటి అరాచకాలు చోటుచేసుకునేవో కూడా ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. పేరుకు కేబినెట్ లో ఉన్నవారు అందరూ మంత్రులే అయినప్పటికీ.. కొందరు మంత్రులు మాత్రమే అధికారం చెలాయించే వారని.. ఇతర శాఖలకు చెందిన మంత్రులు ఫైల్స్ ను కూడా తామే తెప్పించుకుని నిర్ణయాలు తామే తీసుకునేవారని ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. మీడియా ముందు పచ్చి బూతులు మాట్లాడుతూ.. అయిదేళ్ల పాటూ బూతులహీరోగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని శాఖకు చెందిన ఫైల్స్ కూడా అప్పట్లో మరో మంత్రి పేర్ని నాని చూసేవారంటూ.. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర కొత్త విషయాన్ని బయటపెట్టారు.
పేర్ని నానికి చెందిన గోడౌన్లలో బియ్యం మాయం కావడం అనే వ్యవహారంపై రాద్దాంతం ఇంకా చల్లబడలేదు. తన గోడౌన్లలో నిల్వ ఉంచిన వాటిలో ఎంత బియ్యం మాయమైందో తానే లెక్కవేసి లేఖ రాసేసి.. అధికారులు సూచించిన మేరకి జరిమానా డబ్బులను కూడా పూర్తిగా డీడీల ద్వారా చెల్లించేసి.. తాను ఇక సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయినట్టేనని పేర్నినాని కుటుంబం అనుకుంటోంది. కానీ.. దొంగపనిచేసి, దొరికిపోయిన తర్వాత లెంపలు వాయించుకున్నంత మాత్రాన చెల్లుబాటు కాదని, జరిమానా కట్టినంత మాత్రాన నేరానికి జవాబుదారీతనం లేకుండా తప్పించుకోజాలరని మంత్రి కొల్లు రవీంద్ర అంటున్నారు. పేర్ని నాని వ్యవహారంపై ఒక రేంజిలో ఫైర్ అయిన కొల్లు రవీంద్ర.. అప్పట్లో కొడాలి నాని పౌరసరఫరాల మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆయన ఫైల్స్ అన్నింటినీ పేర్ని నాని తను తెప్పించుకుని చూసేవారిన కొల్లు రవీంద్ర అంటున్నారు.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నా, తర్వాత మాజీ అయినా.. 2024 ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకపోయినా.. పేర్ని నాని మాత్రం.. ఎడాపెడా ప్రెస్ మీట్లు పెట్టి.. తెలుగుదేశం వారిని తిట్టడమే తన పనిగా పెట్టుకునే వారు. అంత చురుగ్గా ప్రెస్ మీట్లు పెట్టే పేర్ని నాని.. తన సొంత కుటుంబం బియ్యం స్మగ్లింగ్ లో చిక్కుకునే సరికి నోరు మెదపడం లేదని కొల్లు రవీంద్ర విమర్శిస్తున్నారు.
బియ్యం కొట్టేసి.. డబ్బులు కట్టేసినంత మాత్రాన తప్పించుకోజాలరని కొల్లు రవీంద్ర అంటున్నారు. గోడౌనునుంచి బియ్యం మాయం చేడయం వ్యవహారం అంతా మామూలుగానే ఉన్నది గానీ.. జగన్ కాలంలో.. కొడాలి నాని మంత్రిత్వ వ్యవహారాలను కూడా పేర్ని నాని నడిపేవారనే వ్యవహారమే చర్చగా మారుతోంది. జగన్ భక్తులైన కొందరు భక్తులకు మాత్రమే నిర్ణయాధికారం ఉండేదా అని అందరూ అనుకుంటున్నారు. మొన్నటికి మొన్న బాలినేని కూడా తనకు సంబంధం లేకుండా సెకితో ఒప్పందాలను పెద్దిరెడ్డి నేతృత్వంలోనే చేసుకున్నారని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది మరొక దందా అన్నమాట.