ఈ వారం థియేటర్స్ లో విడుదలైన కొత్త సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తున్నాయి. ఒకవైపు తేజ సజ్జ హీరోగా వచ్చిన మిరాయ్ మరోవైపు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన కిష్కింధపురి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోటీని సృష్టించాయి. ఈ రెండు సినిమాలకు కూడా మంచి స్పందన రావడం గమనార్హం.
ప్రస్తుతం మిరాయ్ శక్తివంతమైన పోటీ ఇస్తున్నప్పటికీ, కిష్కింధపురి కూడా వెనకబడకుండా బలమైన బుకింగ్స్ సాధిస్తోంది. ప్రేక్షకులు సినిమా మీద పాజిటివ్ టాక్ ఇవ్వడంతో ఈ చిత్రానికి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే వేగం కొనసాగితే వారాంతంలో మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.