ఏజెంట్ జాన్ స్నో’ గా నట కిరీటీ!

యంగ్ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నితిన్ యాక్ట్‌ చేస్తున్న మూవీ ”రాబిన్ హుడ్” . ఈ సినిమా ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకి ద‌ర్శ‌కుడు వెంకీ కుడుముల దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో నితిన్‌ వెంకీ కుడుముల కాంబో గురించి ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ఇక ఈ సినిమాతో ఈ కాంబినేష‌న్ మరోసారి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాను పూర్తి క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్టైన‌ర్ గా  రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో భారీగా క్యాస్టింగ్ నటిస్తోంది. ఇందులో న‌ట కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్ కూడా ఓ ప్ర‌ధాన పాత్ర‌లో యాక్ట్‌ చేస్తున్నారు. శుక్రవారం ఆయ‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమాలోని ఆయ‌న పాత్ర‌ను అభిమానులకు పరిచయం చేశారు మూవీ మేక‌ర్స్. ఈ సినిమాలో రాజేంద్ర ప్ర‌సాద్ ఏజెంట్ జాన్ స్నో అలియాస్ జ‌నార్థ‌న్ సున్నిపెంట అనే పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఆయ‌న ప‌ర్పార్మెన్స్ ప్రేక్ష‌కులను మ‌రోసారి క‌డుపుబ్బా న‌వ్వించే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ‌లీల హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు జీవీ.ప్ర‌కాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. డిసెంబ‌ర్ 20న ఈ సినిమాను విడుదల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories