టాలీవుడ్‌లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే ట్రైలర్, పోస్టర్లు, ప్రమోషన్లతో సినిమాపై మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. ఈ సినిమా విజయంతో విజయ్ మళ్లీ భారీ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు.
ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా, పూర్తిగా యాక్షన్, ఎమోషన్ మిక్స్ అయిన డ్రామాగా తెరకెక్కుతోంది. జూలై 31న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాకు ముందస్తుగా మరొక గుడ్ న్యూస్ వచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్లకు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.75 వరకు అదనంగా వసూలు చేయడానికి అనుమతి లభించింది. ఈ పెంపు పది రోజులపాటు అమలులో ఉంటుంది. దీనివల్ల సినిమా కలెక్షన్లపై మంచి ప్రభావం పడే అవకాశం ఉంది. మాస్ క్రౌడ్ ఆకట్టుకునేలా సినిమాను డిజైన్ చేసినట్టు సమాచారం కావడంతో వసూళ్లకు బలం చేకూరుతుందని చిత్ర యూనిట్ ఆశిస్తోంది.
మరోవైపు, తెలంగాణలో టికెట్ ధరల పెంపు విషయమై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. అయితే అక్కడ కూడా ప్రభుత్వ అనుమతిపై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.
కథ పరంగా కాకుండా, కస్టింగ్ పరంగా కూడా ఈ సినిమా ఆసక్తి కలిగిస్తోంది. విజయ్ సరసన భాగ్యశ్రీ బొర్సె కథానాయికగా నటిస్తుండగా, టాలెంటెడ్ నటుడు సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించడంతో ఆల్బమ్‌పై కూడా పాజిటివ్ బజ్ కనిపిస్తోంది.
ఈ సినిమాను నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. బడ్జెట్, టెక్నికల్ విలువలు అన్నీ చూసినప్పుడు, కింగ్డమ్ థియేటర్లో మంచి అనుభూతిని అందించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.