యూఎస్‌ లో ముందుగానే కింగ్డమ్‌ ప్రీమియర్‌ షోలు

విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన కొత్త స్పై యాక్షన్ డ్రామా ‘కింగ్డమ్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో జూలై 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పాటలతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఆసక్తికర విషయం ఏంటంటే, భారతదేశంలో సినిమా విడుదలకు ముందు రోజు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం పెయిడ్ ప్రీమియర్ షోలు ఉండబోవని చిత్రబృందం స్పష్టత ఇచ్చింది. అయితే ఇండియాలో కాకుండా అమెరికాలో మాత్రం కింగ్డమ్ తొలి ప్రీమియర్ షోలు బుధవారం రాత్రి 11 గంటలకు (ఇండియన్ టైమ్) ప్రారంభం కానున్నాయి. అంటే అక్కడి తెలుగు ప్రేక్షకులు భారత్‌లో విడుదలకంటే ముందే ఈ సినిమాను చూసే అవకాశం పొందుతున్నారు.

అమెరికా టైమ్ జోన్ ప్రకారం చూస్తే, తూర్పు ప్రాంతంలో మధ్యాహ్నం 1:30కి, సెంట్రల్‌ టైమ్‌లో 12:30కి, పశ్చిమ తీరాల్లో ఉదయం 10:30కి ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. అంటే అమెరికాలోని థియేటర్లలో మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ స్పై డ్రామాను ముందుగా ఆస్వాదించనున్నారు.

ఇదిలా ఉండగా, ఇండియాలో రిలీజ్ రోజు తెల్లవారుజామునే ప్రత్యేక షోలు పెట్టే యోచన కూడా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 4 గంటలకు లేదా 7 గంటలకు స్పెషల్ షోలు నిర్వహించే అవకాశముందన్న వార్తలు వినిపిస్తున్నా, దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఈ సినిమాను నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించగా, సత్యదేవ్, అయ్యప్ప శర్మ, వెంకటేష్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చిందంటే, థియేటర్లలో సినిమా ఎలాంటి హంగామా చేయబోతుందో అర్థమవుతోంది. ప్రస్తుతం అడ్వాన్స్ బుకింగ్‌లు జోష్ మీద ఉండగా, సినిమా విడుదలతో విజయం ఎలా ఉంటుందో చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories