టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఈసారి పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన భారీ యాక్షన్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ పేరు ‘కింగ్డమ్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని పెంచింది.
ఇప్పటికే ప్రమోషన్స్ ద్వారా పాజిటివ్ బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా, బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే ఓ రేంజ్ లో రిస్పాన్స్ అందుకుంది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఇప్పటివరకూ లక్ష టికెట్లు అమ్ముడవడం విశేషం. ఇది సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌కు అనిరుద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. సంగీతం, టీజర్, విజువల్స్ అన్నీ కలిసి సినిమాకు మాస్ అట్రాక్షన్ తీసుకొచ్చాయి. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. జూలై 31న ‘కింగ్డమ్’ గ్రాండ్ స్కేల్ పై థియేటర్లలో విడుదల కాబోతుంది.
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమా, ఓపెనింగ్ డే నుంచే బాక్సాఫీస్ వద్ద హవా చూపించబోతుందనే టాక్ స్పష్టంగా కనిపిస్తోంది. ‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండకి మరో మేజర్ హిట్‌ను అందిస్తుందా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది.