టాలీవుడ్ లోకి మరో సెన్సేషనల్ హిట్ గా “కింగ్డమ్” సినిమా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా తొలిరోజే భారీ స్థాయిలో కలెక్షన్లు సాధించింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, విడుదలైన తొలి రోజే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.
యూఎస్ మార్కెట్ తో పాటు కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో కూడా ఈ చిత్రం బలమైన ఓపెనింగ్స్ తో ఆకట్టుకుంది. మేకర్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, “కింగ్డమ్” విడుదలైన రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 39 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇది సెలవు రోజుకూడా కాని సందర్భంలో ఈ స్థాయి వసూళ్లు రావడం సినిమాపై ఎంతటి ఆసక్తి ఉందో సూచిస్తుంది.
విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇది ఒక రికార్డు స్థాయి ఓపెనింగ్ గా నిలిచింది. ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుద్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటోంది. నిర్మాణంలో కూడా నాణ్యతపై ఎలాంటి రాజీ పడకుండా సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాయి.
ఈ సినిమా మొదటి రోజు నుండి ఇలా హైప్‌ను కొనసాగిస్తుండటంతో, వసూళ్లు రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా చూస్తే విజయ్ దేవరకొండకు ఇది ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు.