కూలీ పై కన్నేసిన కింగ్‌ నాగార్జున!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కూలీ’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుంది. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మరోసారి రజనీ తన సత్తా చూపేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో పలువురు స్టార్స్ మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. వారిలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా ఒకరు.

ఈ సినిమాలో సైమన్ అనే పాత్రలో నాగార్జున నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు నాగార్జున ఈ సినిమాలో నటించడమే కాకుండా, ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు రైట్స్‌ను కూడా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆయన ఈ చిత్ర తెలుగు రైట్స్ విషయంలో మేకర్స్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు డీల్ త్వరలోనే క్లోజ్ అవుతుందని చిత్ర వర్గాల టాక్‌.

కాగా, ఈ చిత్ర తెలుగు రైట్స్ కోసం నాగవంశీ, దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి కూలీ చిత్ర తెలుగు రైట్స్ ఎవరు దక్కించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా గ్రండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories