పాన్ ఇండియా స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్న టీజర్ ఏదైనా ఉందంటే అది “వార్ 2”దే. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలసి తెరపై సందడి చేయబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా విడుదలైన టీజర్ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో భారీ స్పందనను సొంతం చేసుకుంది.
టీజర్ చూస్తే ఎక్కువగా హృతిక్, తారక్ లపై దృష్టి వెళ్లేలా ఉంటుంది. అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించిన అంశం మరోదే. కథానాయిక కియారా అద్వానీ టీజర్‌లో ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఆమె కనిపించిన కొన్ని సీన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బికినీలో కియారా కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో, ఆమె లుక్స్ పై నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. విజువల్స్ లో ఆమెను చూపించిన విధానం చాలా స్టైలిష్‌గా ఉండటంతో ప్రేక్షకులు విశేషంగా స్పందిస్తున్నారు. వార్ 2 టీజర్‌లో హృతిక్, తారక్‌ల సరసన కియారా కూడా ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీజర్ మొత్తంలో ఆమె ఉన్న కొన్ని క్షణాలే కానీ, వాటే ప్రేక్షకుల్లో భారీ ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాయి.