తమిళ స్టార్ హీరో కార్తీ మరోసారి కొత్త సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కార్తీ, ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు. ఈ సినిమాకు ‘మార్షల్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఈ టైటిల్‌తోనే మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఇకపోతే ఈ పోస్టర్‌లో హీరో ఫేస్ చూపించకుండా మిస్టరీ కాపాడారు. అందుకే కార్తీ ఈ సినిమాలో ఎలాంటి గెటప్‌లో కనిపించనున్నాడా అన్న విషయంపై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నది తమీజ్ అనే డైరెక్టర్ కాగా, మ్యూజిక్ డైరెక్టర్‌గా సాయి అభ్యంకర్ పని చేస్తున్నారు.
శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ను కూడా అధికారికంగా ప్రారంభించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. టైటిల్, పోస్టర్ విడుదలతో పాటు షూటింగ్ స్టార్ట్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. మరి ఈసారి కార్తీ ఎలా మెప్పిస్తాడో చూడాలి.