టాలెంటెడ్ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి చేసిన “కాంతార” ఎంతటి స్థాయిలో సంచలన విజయం సాధించిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి ప్రీక్వెల్ గా వస్తున్న “కాంతార 1” కోసం అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి.
ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతుందనే వార్తలు బయటకు వచ్చాయి కానీ వాటికి ఎలాంటి నిజం లేదని టీమ్ స్పష్టంగా చెప్పింది. మునుపే ప్రకటించిన తేదీకే సినిమా థియేటర్లలోకి రాబోతుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మరో ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1 రాత్రి నుంచే స్పెషల్ పైడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ ప్రీమియర్స్ కేవలం కన్నడ, తెలుగు భాషల్లోనేనా లేక దేశవ్యాప్తంగా వేరే భాషల్లో కూడా జరుగుతాయా అనేది ఇంకా ఖరారు కాలేదు. అధికారిక ప్రకటన కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.