కన్నడలో రూపొందిన ‘కాంతార’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. హీరోగా, డైరెక్టర్‌గా రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. యాక్షన్ థ్రిల్లర్ కథ, డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా హిట్ అయి, జాతీయ అవార్డు కూడా కొట్టేసింది.
ఇప్పుడు అదే ఫ్రాంచైజీకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: అ లెజెండ్ చాప్టర్ 1’ తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడుతో జరిగిపోగా, ఇప్పుడు మేకర్స్ ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు – ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని అధికారికంగా ప్రకటించారు!
తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలో కాంతార ప్రపంచం ఎలా ఉండబోతుందో రిషబ్ శెట్టి క్లారిటీగా చూపించారు. కేవలం సినిమా కాదు.. తమ చరిత్రని చూపించేందుకు తాను ఎంత కష్టపడ్డానో ఈ వీడియోలో కనిపిస్తుంది. భారీ సెట్స్, స్టన్నింగ్ విజువల్స్, స్ట్రాంగ్ క్యాస్టింగ్ అన్నీ కనిపించాయి.
ఈ సినిమా హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మళ్లీ ఓ సెన్సేషన్ ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేయబోతున్నారు.