పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన హైపెస్ట్ సినిమా కాంతార చాప్టర్ 1 ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. హీరోగా, దర్శకుడిగా రిషబ్ శెట్టి తెరకెక్కించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ ప్రధాన పాత్ర పోషించింది. రిషబ్ శెట్టి కెరీర్ లోనే కాకుండా మొత్తం కన్నడ సినీ పరిశ్రమలో కూడా ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచింది.
విడుదలైన మొదటి వారానికే 500 కోట్ల వసూళ్ల మార్క్ దాటిన కాంతార చాప్టర్ 1 భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ప్రేక్షకులు ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ ఇవ్వడం లేదు అనే మాట వినిపిస్తోంది.
ఇండియా లో తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా మంచి ఫలితాలు సాధిస్తుండగా, ఓవర్సీస్ మార్కెట్‌లో మాత్రం కొంత తగ్గుదల కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్‌లో కాంతార మొదట బాగా స్టార్ట్ అయి 3 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు సాధించింది. కానీ ఆ తర్వాత క్రమంగా కలెక్షన్లు తగ్గినట్లు తెలుస్తోంది.